‘కేసీఆర్ గారూ ,మీ సర్కారు నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలైపోవాలో చెప్పండి  విశ్వనగరం చేస్తామంటూ మీరు చెప్పుకుంటున్న జంటనగరాల్లో వర్షాలు పడినప్పుడల్లా నాలాలు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ కనిపించనంతగా నీరు నిండిపోయి ఎన్ని ప్రాణాలు బలైపోయాయో లెక్క తీస్తే ఒక గిన్నిస్ రికార్డు అవుతుంది. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడల్లా మీ పార్టీ నేతలు రావడం, ఇలా జరక్కుండా చూస్తామని హామీలిచ్చి వెళ్ళడం మామూలైపోయింది. అడుగడుగునా కబ్జాలు, అక్రమ కట్టడాలతో ఆ ప్రాంతాలు  చినుకు పడితే చాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రజల ఆగ్రహ వెల్లువలో మీరూ కొట్టుకపోకముందే మేలుకుని పరిస్థితిని చక్కదిద్దండి’ అంటూ  టీకాంగ్రేస్ నాయకురాలు, సీనియర్ నటి విజయశాంతి ఒక  ట్వీట్ లో తెలంగాణ సర్కార్ పై మండి  పడింది. ఓపెన్ నాలాలో ప‌డి సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని మ‌ర‌ణించిన‌ ఘటనపై విజయ శాంతి ఘాటుగా స్పందించారు. వర్షాలు పడినప్పుడల్లా నగరంలో నాలాలు పొంగిపొర్లుతూనే ఉన్నాయని  వర్షాల వల్ల నగరవాసులు పడుతున్నారని  ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ గారూ… మీ సర్కారు నిర్లక్ష్యానికి సికింద్రాబాద్‌లో వర్షాలకు పొంగిపొర్లిన దీనదయాళ్‌నగర్‌ ఓపెన్ నాలాలో సుమేధ అనే 12 ఏళ్ళ విద్యార్థిని జీవితం కరిగిపోయింది.కూతురి మరణం తో బాధపడుతున్న ఆ తల్లి  దండ్రులకు ఎం సమాధానం చెబుతారని  ఆమె ప్రశ్నించింది.

You Might Also Like