తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో రెండువందల బీద బ్రాహ్మణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందజేశారు. సోమవారం   వేయి స్తంభాల గుడి ఎదురుగా జరిగిన కార్యక్రమంలో  కరోనా వైరస్ వల్ల గత రెండు నెలలుగా ఎలాంటి శుభ-అశుభ కార్యక్రమాలు లేకుండా, కుల వృత్తులు లేక అదే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆంక్షల కారణంగా పనులు లేనటువంటి రెండు వందల బ్రాహ్మణుల కుటుంబాల వారందరికీ  ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం, కందిపప్పు, చింతపండు లాంటి నిత్యావసర వస్తువులను అయన  అందజేసారూ.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్  మాట్లాడుతూ ప్రపంచీకరణ వలన ఇలాంటి  సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ వైరస్ వల్ల ప్రభుత్వం ప్రజలు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కెసిఆర్  తగిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, పేద బ్రాహ్మణులకు పురోహితులకు బ్రాహ్మణ సేవా సమితి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తోటి బ్రాహ్మణులను ఆదుకోవడం కోసం ఇలాంటి సేవా  కార్యక్రమము చేయడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.  బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ కుమార్ మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఇలాంటి  కార్యక్రమాలు చేపడుతూ  రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.  అదేవిదంగా నిరంతరం కరోనా పోరాటంలో పాలు పంచుకొంటున్న మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ పాత్రికేయ మిత్రులు ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ప్రముఖ త్రిపురనేని గోపీచంద్ ,  టిఆర్ఎస్ నాయకులు రజనీకాంత్  ఈ కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమార్  గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి  మహిళా అధ్యక్షురాలు గాయత్రి ఉపాధ్యక్షులు విన్నకోట రాజ్ కుమార్ ,పరశారం నరసింహాచార్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ సెంట్రల్ జైలు ఖైదీలు స్వయంగా తయారుచేసిన "క్లాత్ మాస్కులు" లను సెంట్రల్ జైల్ అధికారి మురళీధర్  సహకారంతో 200 మార్కులను పేద బ్రాహ్మణులకు ఈ వస్తువులతో పాటు పంపిణీ చేయడం జరిగింది. 

You Might Also Like