లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు బయటకు రావద్దని ఒక వేళ ఎవరైనా కర్ఫ్యూ సమయంలో గడప దాటి బయటకు వస్తే వారిపై కేసులు తప్పవని వరంగల్  పోలీస్ కమిషనర్  డా. వి. రవీందర్ హెచ్చరించారు. కరోనా వ్యాధి నియంత్రణకై కోసం  ప్రభుత్వం  ప్రకటించిన లాక్ డౌన్  అమలుతీరుపై సిపి శుక్రవారం క్షేత్ర  స్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్బంగా  పోలీస్ కమిషనర్  ములుగు రోడ్డు ,  యం.జి.యం, పోచమ్మమైదాన్ ప్రాంతాల్లో ఎర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసుల పనీతీరును పరిశీలించడంతో పాటు విధులు నిర్వహిస్తున్న పోలీసుల  అవసరాలను కూడా అడిగి తెలుసు కోవడంతో పాటు రోడ్లపైకి ప్రజలు రాకుండా నియంత్రించేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్    స్టేషన్ ఇన్స్‌పెక్టర్లకు పలుసూచనలు చేసారు.

ఈ సందర్భంగా అనవసరంగా  రోడ్లపైకి వచ్చిన వాహనదారులను పోలీస్  కమీషనర్ ప్రశ్నించడంతో పాటు ఇకపై రోడ్లపైకి అనవసరంగా రావద్దని వస్తే కేసులు నమోదు చేయబడుతుందని పోలీస్ కమీషనర్ హెచ్చరించారు . అనంతరం వరంగల్  పోలీస్ కమిషనర్  డా. వి. రవీందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో  అనవసరం రోడ్లపై తిరగడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయబడితాయని. అధే విధంగా వాహనాలను సీజ్ చేసి జరిమానాలను విధించబదంతో పాటు వాహనాలను లాక్ డౌన్ అనంతరం అందజేయడం జరుగుతుందని. ప్రభుత్వం  లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 89 కేసులను నమోదు చేయడంతో పాటు 49 మందిని అరెస్టు కావడంతో పాటు  518 వాహనాలు సీజ్ చేయబడ్డాయని ఇందులో  305 ద్విచక్ర వాహనాలు, 189 ఆటోలు, 24 కార్లను పోలీసులు సీజ్ చేశారు.

అదే విధంగా ట్రాఫిక్ విభాగం పోలీసులు 1631లను నమోదు చేయడం జరిగిందని.  ఇకనైన ప్రజలు స్వీయ  నిర్భంధానికి ప్రాధాన్యత ఇవ్వాలని. నిత్యావసర  వస్తువులు కోనుగోలు చేసేందుకు గాను కుటుంబంలోని ఒక్కరూ మాత్రమే తమ  దగ్గరలోని మార్కెట్లో  ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో కోనుగోలు చేసి తక్షణమే వారివారి ఇండ్లకు తిరిగి వెళ్ళిపోవాలని పోలీస్ కమీషనర్ తెలిపారు.

విదేశాల నుండి వచ్చి  హోం క్యారంటైన్ వున్న వ్యక్తులపై పోలీస్ నిఘా పెట్టబడిందని. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం   గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయబడుతోందని ఈ సమయంలో ప్రజలు పూర్తిగా ఇండ్లకే పరిమితం కావాలని. కర్ఫ్యూ సమయంలో  వైద్యపరంగా ఎదైనా సమస్య వస్తే డయల్ 100కు సమాచారం అందజేసిన వారిని హస్పటల్ కు తరలించేందుకు పోలీసులు సహకారం అందజేయబడుతుందని పోలీస్ కమిషనర్  తెలిపారు.


You Might Also Like