దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా జనాలు బయటకు రాకుండా చూస్తున్న పోలీసులకు ఇచిత్రమైన పరిస్టులు ఎదురవుతున్నాయి.తాజా గా  తన ప్రియుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. అనుమతి ఇచ్చేవరకు కదిలేది లేదంటూ స్టేషన్ బయట బైఠాయించింది.   సోమవారం ఉదయం ఓ యువతి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సార్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ను చూడాలని ఉంది దయచేసి అతన్ని కలిసేందుకు   అనుమతి ఇవ్వండి అంటూ పోలీసులను కోరింది.ఆమె అభ్యర్ధన విన్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి ఆమెను ప్రేమిస్తున్న యువకుడు ఆదివారం ఉదయం అంబర్‌పేట నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12కు వచ్చాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మా అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. కాగా అది కుదరని పని అంటూ పోలీసులు  ఆమెకు సర్దిచెప్పి పంపించేశారు. 

You Might Also Like