కరోనా వైరస్ విజృభిస్తున్న వేల  ప్రజలు ఎవరు బయటకు రాకపోవటంతో పనుల కు వెళ్లలేని పరిస్థితి ఉండటం తో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో వున్న  సాయి రక్ష డాబా దగ్గర గల 300 మంది నిరాశ్రయులు   కి  యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్బంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిశెల రాజశేఖర్ గౌడ్   మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితి లో ప్రతీ ఒక్కరు సమన్వయము తో  నిరాశ్రయులకు సహాయం అందించి ఆదుకోవాలని, లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు మనకు తోచిన సహాయ సహకారాలు అందించాలని, అందరూ సహకరించి కరోనా వ్యాప్తి ని అరికట్టి కరోనా రహిత దేశం గా మార్చుకోవాలని, ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటించాలని కోరారు. ఈ రోజు అన్నదానాన్ని  నిర్వహించిన ఫౌండేషన్ సభ్యుడు ఐతం ప్రశాంత్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ సభ్యులు ఐతం ప్రశాంత్, సాజిద్, రాజు, తాళ్లపల్లి వినయ్, కోరేపు అనిల్ , బండి సాయి కిరణ్  తదితరులు పాల్గొన్నారు.

You Might Also Like