కరోనాతోనే విలవిలా లాడుతున్న ప్రజలకు ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచానికి మరో విపత్తు పొంచి ఉందని, అది 2021 మార్చి 31 వరకు కొనసాగుతుందని కర్ణాటకకు చెందిన బాల మేధావి జ్యోతిష్య పండితుడు అభిగ్య ఆనంద్ జోస్యం చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ఇంకా ప్రమాదకారని, దీని వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని అన్నాడు. 2021 మార్చి 31 వరకు ఇది ప్రపంచాన్ని పీడిస్తూ గడగడా లాడిస్తుందని అయన హెచ్చరించారు.

అభిగ్య ఆనంద్ కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏడు నెలల కిందటే చెప్పిన జోస్యం అక్షరాలా నిజమవడం తో అయన వార్తల్లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గ్రహస్థితులను అనుసరించి ముప్పు ముంచుకొస్తోందని ఈ మేధావి ముందే హెచ్చరించాడు. ముఖ్యంగా 2019 నవంబరు నుంచి 2020 మే వరకూ ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఆయన ఒక  వీడియో చేసి ముందే రిలేస్ చేయడం గమనార్హం.ప్రపంచ వ్యాప్తం గా  వైమానిక రంగం తీవ్రంగా దెబ్బతింటుందని చైనా యుద్ద సమస్యలను ఎదుర్కొంటుందని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ముందే చెప్పడం తో పాటు ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలు అతలాకుతలమవుతాయని ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని అయన వివరించాడు.వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోనే రాబోయే ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని సూచించారు. కర్మ ఫలం పెరుగుతున్నందున జంతు హింసను కచ్చితంగా వీడాలని, ప్రకృతి హానికలిగించడం మానేయాలని దీనిని విడకపోతే భూమాత ప్రకోపానికి గురికాకతప్పదన్నారు. 


ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని కూడా విశ్లేషణ చేశాడు. ఆగస్టు 2019లోనే అభిగ్య ఆనంద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియోను అభిగ్య పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు మే 31 వరకు ఉంటుందని జోస్యం చెప్పాడు.అభిగ్య వీడియో ప్రకారం  జూన్ 30 వరకు ప్రపంచం లో కరోనా విపత్తు కొనసాగుతుందన్నారు.


జులై ప్రారంభం నుంచి సానుకూల ఫలితాలు ఉంటాయని, వైరస్ తగ్గుతుందన్నారు. జూన్ నుంచి డిసెంబరు మధ్య వరకూ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయని,వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారని, మే 4 వరకు ప్రజలు తీవ్ర ఆహారలేమిని ఎదుర్కొంటారని ఆ తరువాత డిసెంబర్లో మల్లి ఒక ఉపద్రవం ముంచుకొస్తుంది అయన తెలుపుతూ జాతా వీడియో పోస్ట్ చేసాయడం తో ఇప్పటికే లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న జనం ఆందోళనకు గురవుతున్నారు.


You Might Also Like