లాక్ డౌన్ తో కొత్త తంటాలు వచ్చి పడుతున్నాయి.గుట్టు గా ఆగిన ప్రేమ వ్యవాహారాలు సంబంధాలు రట్టయి పోతున్నాయి.వెరసి కరోనా కుటుంబాల మధ్య కార్చిచ్చే తుంది.విశేషమేమిటంటే ఈ అక్రమ సంబంధాలు నెరుపుతున్న వారు  ఒక్కొక్కరు మరో  ఇద్దరి  తో సంబంధాలు  కొనసాగించడం విచారిస్తున్న అధికారులను  నోరెళ్ళ బెట్టేలా చేస్డింది.మొన్నతెలంగాణా లో సుర్యాపేట్  ఒక వేశ్యను కలిసిన చాలా అందికీ కరోనా సోకగా వారి లో చిచ్చు రాజుకున్న ఘటన మరవక  ముందే  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఒక అమ్మాయి ద్వారా కరోనా వ్యాపించడం ఆ అమ్మాయి రహస్యంగా కోన సాగించిన సంబంధాల గుట్టు రట్టవడం తో అమ్మాయి తల్లి దండ్రులు వేదన పడుతున్నారు. ఆ అమ్మాయికి కరోనా పాజిటివ్ అని తేలడం తో ఆ అమ్మాయికి ఆమె బాయ్ ఫ్రెండ్ ద్వారా కరోనా వచ్చిందని అధికారుల విచారణలో వెల్లడయింది. కానీ అమ్మాయి తల్లిదండ్రులకు అసలు తమ కూతురికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం తెలియదు. బాయ్ ఫ్రెండ్ కు టెస్టులు చేయగా ఇతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిద్దరి ఎఫైర్ బయటపడింది.  ఇక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ అమ్మాయి ద్వారా మరో అబ్బాయికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ అమ్మాయి ఇద్దరితో ఎఫైర్ సాగిస్తుందని విచారణలో తేలింది. దీంతో కూతురు చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు.ఇక ఈ కథ ఇంతటితో ఆగలేదు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కు మరో అమ్మాయి తో కూడా లవ్ ఎఫైర్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆమెకు పాజిటివ్ వచ్చేసింది.ఇక తాజాగా ప్రతీరోజు ఆఫీసుకు వెళుతున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ సోకింది. అయితే అతడి కొలీగ్స్ చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా సోకలేదు.ఆ వ్యక్తి ఆఫీస్ ముగియగానే సెకండ్ సెటప్ దగ్గరకు వెళ్లి వస్తాడని ఆమె ద్వారా వ్యాపించిందని తేలింది. దీంతో వారి ఫ్యామిలీలో చిచ్చు రేగింది.ఇలా కరోనా లింకులు చేధించే క్రమంలో చాలా అక్రమ సంబంధాలు ఎఫైర్స్ బయట పడుతున్నాయి.వారి వారి కాపురాలను కరోనా కూల్చుతోంది. చాలా మంది యువత ఇద్దరు ముగ్గురితో లవ్ ఎఫైర్స్ పెట్టుకుంటున్నట్టు కరోనా వల్ల బయట పడుతోంది.ఇలా ఇన్నాళ్లు ఇంట్లో బుద్ది మంతులుగా కలరింగ్ ఇచ్చిన వాళ్ల చీకటి వ్యవహారాలన్నీ కరోనా దెబ్బకు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి.  కరోనా వల్ల చెడు జరుగుతున్నా మనుషుల లోపలి బండారాలు బయట పడుతుండడం గమనార్హం You Might Also Like