తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ సంచలనం సృ ష్టించింది.పెద్దపల్లి జిల్లా మంథని పోలీ స్టేషన్ లో రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఉండే ఒక బాత్ రూమ్ లో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ఈ ఆత్మ హత్య తో కంగుతిన్న పోలీసులు మృతిని కుటుంబంతో రాజీ  కుదుర్చుకునేందుకు ఉదయం నుండి ప్రయత్నించి సఫలీకృతులైనట్లు  తెలుస్తుంది.ఇందుకోసం సాక్షాత్తు తెలంగాణ  డిజిపి కార్యాలయం నుండే అధికారులు రంగంలోకి దిగి మృతుని కుటుంబాన్ని నయానో భయానో బెదిరించి తమ వైపు తిప్పుకున్నట్లు మాజీ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించడం కొసమెరుపు.  దీనితో ఇందుకు  కారణమైన ఎవరిపై చర్యలు లేకుండానే వివాదాం సమసి పోయినట్లయింది.


అసలేం జరిగింది..?

రెండు రోజుల క్రితం రామగిరి మండలం రామయ్య పేట గ్రామానికి చెందిన రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు వన్య ప్రాణుల వేట కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. రామగిరి మండలం లొంకకేసారం సమీపంలో వన్యప్రాణుల వేట కోసం తీగలు వేసే క్రమంలో ఇటీవల పెగడ వెంకటేశ్‌ అనే వ్యక్తి మృతిచెందిన సంగతి తెల్సిందే. ఈ సంఘటనలో మరో ఐదుగురు పాల్గొనగా అందులో గుండారానికి చెందిన రాచకొండ సదయ్య, లక్ష్మన్‌, గుర్రాల కిష్టస్వామి, దండె రమేశ్‌, అనే నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. లొంకకేసారం సమీపంలోని చెరువు వద్ద వన్యప్రాణుల వేట కోసం ఆరుగురు వ్యక్తులు వెళ్లారని, వన్య ప్రాణుల కోసం తీగలు వేస్తున్న సమయంలో పిడుగు వెంకటేశ్‌ మృతిచెందగా సతీష్‌ అనే వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు.మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. వన్యప్రాణులను వేటాడితే అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఒక వ్యక్తి మృతి చెందటం తో పాటు మరో వ్యక్తి గాయపడగా ఈ విషయమై పోలీసులు తీవ్రం గా పరిగణించి ఆ ప్రాంతం నుండి వన్య ప్రాణులకోసాము వేటాడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ నేపత్యం లోనే రంగయ్య అనే వ్యక్తిని పోలీసులు వన్య ప్రాణుల వేట కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.అయితే అరెస్ట్ చూపిన వెంటనే అతన్ని రేమండ్ పంపక తమ వద్ద ఉంచుకుని పోలీసులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారని విమర్శలు వెలువడుతున్నాయి.రంగయ్య ను ఏమా ఆశించి బెదిరించి తమ వద్ద ఉంచుకున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రంగయ్యను కొందరు పోలీసులు లంచం కొరకే తమ అధీనం లో ఉంచుకుని బెదిరించినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.తాము కోరిన డబ్బులు ఇవ్వాలని లేకుంటే పిడుగు వెంకటేష్ హత్య కేసులో నీ పేరు పెడుతామని పి డి  ఆక్ట్ నమోదు చేస్తామని బెదిరించడం  వల్లే సోమవారం అర్ధరాత్రి ఆత్మ హత్యకు పాల్పడ్డాడని రంగయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.మంగళవారం ఉదయం వరకే రంగయ్య ఆత్మ హత్య వార్త బయటకు పొక్కినప్పటికీ రామగుండము సి పి సత్యనారాయణ నేతృత్వం లోని పోలీసులు డిసిపి రవిందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వ హించి శవాన్ని మీడియాకు చూపడానికి నిరాకరించారు.ఈ లోపు కొందరు పోలీసులు మృతుని కుటుంబంరో బేరసారాలకు దిగి రాజి కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.మంగళవారం సాయంత్రం వరకు అతనికి పోస్ట్ మార్టం నిర్వహించి శవాన్ని కుటుంబ సభ్యులకు అందించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.దీనిపై మాజి మంత్రి శ్రీధర్ బాబు ఎలా స్పందిచారంటే 

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కస్టడీయల్ డెత్ చేయడమా: మంథని ఘటనపై శ్రీధర్ బాబు ఫైర్


తెలంగాణలో దళిత వర్గానికి చెందిన శీలం రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... వన్యప్రాణుల కేసులో రంగయ్యను మూడు రోజులుగా పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.రంగయ్య పై వన్యప్రాణుల కేసులో పిడీ యాక్ట్ పెడతామని పోలీసులు బెదిరించడం వల్లే ఆయన చేయని నేరానికి ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. జంతువు గురించి మనిషి బలయ్యాడన్న ఆయన... వన్యప్రాణులను కాపాడాలి కానీ విచారణ సరైన పద్ధతిలో చేయాల్సి ఉందని గుర్తుచేశారు.


ఈ నెల 24న రంగయ్యను రిమాండ్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఆయన ఎలా ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రంగయ్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వున్నాయన్న ఆయన.. ఈ కేసుపై జ్యూడిషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఒకవేళ రంగయ్య తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 నుంచి 15 కస్టడీయల్ డెత్స్ నమోదయ్యాయని గుర్తుచేశారు. దళితుల పై పోలీసుల జులం కరెక్ట్ కాదని... రంగయ్య కేసును ఎస్సీ, ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు చెప్పారు.


ఈ కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ, డీజీపీపై ఉందని ఆయన అన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్ అంటే కస్టడీయల్ డెత్ చేయడమా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రంగయ్య కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ కావాలని ఇద్దరు ప్రత్యేక అధికారులను డీజీపీ నియమించడం దారుణమన్నారు. మంథని డివిజన్ పరిధిలో లేని అధికారులు రంగయ్య కుటుంబాన్ని భాదించడం ఏంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మృతుడికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథని ఘటనపై డీజీపీ, హోంమంత్రి స్పందించాలని వెంటనే ఫొరెన్సిక్ ద్వారా నిజనిర్ధారణ నిగ్గు తేల్చాలని శ్రీధర్ బాబు కోరారు.

You Might Also Like