చల్లా దేవారెడ్డి పోలీస్ అధికారిగా అయన పేరు  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరికి సుపరిచితమైన పేరే.జిల్లా పోలీస్ శాఖల్లో ఆయనో ఆయనే డిఫరెంట్ స్టైల్ అధికారి.ఠాణా కు వచ్చే  పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఎంత ఆరాటా పడుతాడో  అంతే స్పీడ్ గా వివాదాలకు దగ్గరవుతుంటాడు.జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్సైగా సిఐ గా పనిచేసి అటు ఉన్నతాధికారుల ఇటు ప్రజల మన్ననలు పొందాడు.అక్రమార్కులు అవినీతి పరులు   గబ్బర్ సింగ్ గా పిలిచే ఈయన గతం లో జగిత్యాల లో పనిచేసేటప్పుడు వివాదం చెలరేగగా  తాజాగా ఇప్పుడు మరో వివాదం లో చిక్కాడు.

ఏడేళ్ల క్రితం హైదరాబాద్ పరిధిలో అతని బంధువులు పెట్టిన కేసులపై ఇప్పటికి చర్యలు తీసుకోలేదని మరో సారి బంధువులే రాష్ట్ర డిజిపి కి పిర్యాదు చేయడం, దీనితో కరీంనగర్ పట్టణంలోని రెండవఠాణా నుండి ఆయనను బదిలీ చేయాలని రాష్ట్ర డిజిపి అధికారి కార్యాలయం నుండి ఆదేశాలు రాగా కుటుంబ తగాదాలకు దేవారెడ్డి పై బదిలీ వేటు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ మేరకు కరీంనగర్ సిపి కమలాసన్  రెడ్డి ని అతనిని హెడ్క్వార్టర్కు అటాచ్ చేయాలని కోరుతూ  ఆదేశాలు వచ్చినట్లు వార్త లు వెలువడుతుండగా అతన్ని బలి చేయ వద్దని పలువురు కోరుతున్నారు.వివరాల్లోకి వెళితే ఆస్తి తగాదాలు కుటుంబ వ్యవహారాల నేపత్యంలో దేవారెడ్డి బంధువులు రాగిడి లక్ష్మా  రెడ్డి దేవారెడ్డి   తనను చంపుతానని బెదిరించాడని హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శీటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాధు చేయగా దేవారెడ్డి తన కారు ఎత్తుకెళ్లాడని  అతని భార్య రజనీ 2013 లో రెండు కేసులు నమోదు చేశారు.

అయితే అప్పటి నుండి దేవారెడ్డిపై ఎలాంటీ చర్యలు తీసుకోకపోవడంతో తిరిగి ఇటీవల  తమకు న్యాయం చేయాలని కోరుతూ రాగిడి లక్ష్మా  రెడ్డి దంపతులు  రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయన దేవారెడ్డి పై విచారణకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.ఈ మేరకు కరీంనగర్ సిపి పరిధిలో జరిగిన ప్రాథమిక విచారణ నివేదికను కరీంనగర్ సిపి  రాష్ట్ర డిజిపి అధికారి కార్యాలయంకు పంపగా దేవారెడ్డిని  రెండవఠాణా నుండి బదిలీ సిపి కీ అటాచ్ చేయాలని వచ్చిన అదేశాల మేరకు అతనిపై బదితీ వేటు పడుతుందని పలు పత్రికల్లో వార్తలు వెలువడుతున్నాయి.ఈ ఊహగానాలు ఎంత మేరకు నిజమనే విషయాలు తెలియాల్సి ఉండగా దేవారెడ్డిపై చర్యలు ఉంటాయా లేవా ఉంటే ఆపేయాలని కొందరు చర్చిస్తుండటం గమనార్హం.ఏడేళ్ల క్రితం హైదరాబాద్ పరిధిలో అతని బంధువులు పెట్టిన కేసులపైఅతన్ని బలి చేయ వద్దని పలువురు కోరుతున్నారు.

You Might Also Like