నేర ప్రవ్రుత్తి తో కత్తి పట్టుకున్న వాడు ఆ కత్తి వేటు కే బలవుతాడనే నానుడి ని నిజం చేస్తూ దారుణ హత్యకు గురై మరణించిన రౌడీ షీటర్ ఎల్లం కథ ఇది.స్మగ్లింగ్ హత్యలు దొంగతనాలు బెదిరింపులు ఇలా నడిచినన్ని రోజులు హవా నడిపించిన ఎల్లం గౌడ్ ను ముక్కలు గా నరికి చంపి తమ కసితీసుకున్నారు అతని శత్రువులు.అసలు ఎల్లంగౌడ్ రామంచ శివారుకు కు ఎందుకు వెళ్లినట్లు అతన్ని ఎవరు నమ్మించి తీసుకెళ్లి అంత దారుణం గా ఎందుకు చంపారు ,వారిని నమ్మి ఎల్లం ఎందుకు అక్కడికి వెళ్లినట్లు ముక్కలుగా నరికిచంపేంత కక్షలు వారి మధ్య ఏమి ఉన్నాయనే విషయాలను పోలీస్ లు విచారిస్తున్నారు.గతకొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్  దారుణ హత్యకు గురయ్యాడు.

సిద్ధిపేట మండలం ఇమాంబాద్ గ్రా  మానికి చెందిన ఎల్లం గౌడ్ ఆది నుండి నేర ప్రవ్రుత్తి కలిగి ఉన్నాడని చెడు స్నేహాలతో ఆ ప్రాంతం లో దాదా గిరి చెలాయించే వాడని క్రమేణా చిన్న చిన్న బెదిరింపుల కేసుల నుండి దొంగనోట్ల కేసు హత్యల్లో ఇతడుప్రధాన నిందితునిగా మారాడని పోలీస్ విచారణ లో తేలినట్లు సమాచారం. ఎల్లంగౌడ్‌ పలు కేసుల్లో ప్రధాని నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా ఉండగా కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారం.

అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పలు మార్లు ప్రాణాలు కాపాడుకున్నాడని ప్రస్తుతం పరారీలో ఉన్నాడని స్థానికుల చెబుతున్నారు.ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్లాన్ ప్రకారం హత్య చేశారు.చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై గొడ్డలితో నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది.ఒక చేతిని నరికి రోడ్ పై పడవేసి హంతకులు బీబత్సహమ్ సృష్టించారు.పథ కక్షలతో నే అతన్ని హత్య చేశారని తెలుస్తుండాగా వారు ఈ ప్రాంతానికి చెందినా వారేనా మరెక్కడి నుండి వచ్చి ఏ హత్యకు పాల్పడ్డారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అతన్ని ఇమామ్ బాడ్ లో చంపారా లేక అక్కడి నుండి ఎవరైనా నమ్మించి రామంచ శివారుకు తీసుకువచ్చి ఎల్లంగౌడ్‌ను హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పాత కక్షలతో నే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు హంతకుడు నేరుగా వెళ్ళిపోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ప్రచారం అవుతుండగా జిల్లా ఎస్ పీ నోయల్ డేవిస్ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులని సమీక్షించారు.

You Might Also Like