లాక్ డౌన్ సమయం లో నలుగురిని వేసుకుని మీ కారుని సైరన్ వేసుకుని నడపమన్నారా చట్ట సభలకు ప్రతినిధులుగా ఇదేనా మీరు చేస్తున్న చట్టం అంటూ పోలీసులు ఒక ఎంపీని నిలదీశారు.కారులో వెళ్తున్న తన కుమారుడిని అడ్డుకున్నారన్న కారణంతో నాగర్‌కర్నూలు టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు పోలీసులతో గొడవకు దిగగా ఎంపీ అని చూడకుండా పోలీస్ లుకూడా అతనికి దీటైన సమాధానమిచ్చారు.ఈ సంఘటన  హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులను తిడదామని వచ్చిన ఎంపీ అక్కడ కొందరు వీడియోలు తీస్తుండటం తో వెనక్కి తగ్గ్గగా సందట్లో సడేమియాలా పోలీసులు ఎంపీ కి రూల్స్ బోధించారు.చట్టం తయారు చేసే మీరు ఇలా చట్టాలను వైలెట్ చేస్తే ఎలా నాటు నిలదీశారు అయితే తానూ ఒకటి అనుకుని వస్తే ఇంకొకటి జరుగుతుందని భావించిన ఎంపీ పోలీస్ లు తనను నిలదీస్తున్న మీడియా భయానికి వెనక్కి తగ్గి వెళ్ళిపోయడం విశేషం.

అసలు జరిగినదేమిటి అంటే  ఎంపీ కుమారుడు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు అయిన భరత్ కుమార్ ఈ నెల 15న మరో నలుగురితో కలిసి కారులో నగరానికి వస్తున్నారు. పహాడీషరీఫ్-శ్రీశైలం రహదారిపై లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు ఎంపీ స్టిక్కర్‌తో ఉన్న కారులో ఎంపీ కనిపించకపోవడంతో కారును ఆపారు. దీంతో భరత్‌కుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాను ఎంపీ కుమారుడినంటూ పోలీసులను తెలుపగా సైరన్ వేసుకుని రావాచ్చా అంటూ గట్టిగానే హెచ్చరించిన పోలీసులు  కారును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.తరువాత వచ్చిన ఒత్తిడితో  మరోసారి ఇలా చేయొద్దంటూ భరత్‌కుమార్‌కు చెప్పి వదిలేశారు.


విషయం తెలిసిన ఎంపీ రాములు ఆ తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇక్కడ ఏ  ఎస్ ఐ శ్రీరామ్ రెడ్డి ఎవరు అంటూ  తన కుమారుడు వెళ్తున్న కారును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను 15 ఏళ్లు రాష్ట్రమంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం ఎంపీగా ఉన్నానని, తన కారును ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చెయ్యగా అప్పుడే అక్కడికి చేరుకున్న మీడియా ను చూసి పోలీస్ లు ఎం పి కి ఎదురు తి రిగారు.  అయితే తమ రికార్డు అలాగే ఉందని తాము ఏమైనా తప్పు చేసామాన్ని పోలీస్ లు ప్రశ్ని స్తుండగా ఎం పి గన్మెన్ లు పరిస్థితి ని గమనించి ఎం పి ని తీసుకెళ్లారు.

You Might Also Like