రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో దారుణాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.మండలంలో కొందరి నాయకులు  మాఫియా గా మారి తమకు ఎదురుచెప్పిన అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారని ఇందులో బాగము   గానే ఒక హత్య పలు హత్యాయత్నాలు  దాడులు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతూ జిల్లామంత్రి కేటీఆర్ ను తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

ఈమేరకు ఆదివారం మండల ప్రజలు వాట్సాప్ గ్రూపుల ద్వారా  తమ ఇబ్బందులను ఒక విజ్ఞాపన పత్రంగా షేర్ చేయడంతో రాష్ట్రప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంత కుంటలో ఇంత రాక్షస  రాజ్యం నడుస్తుందా అని  చర్చించుకుంటున్నారు.కొందరైతే జిల్లా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రామ రాజ్యం  లాంటి జిల్లాలో ఇంత రాక్షసంగా వ్యవహరిస్తున్నారా  అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వారు షేర్ చేసిన ఈరోజున్యూస్.ఇన్ కు  పంపిన వార్త తో పాటు ఫోటోలను కూడా ఇక్కడ అందిస్తున్నాము.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని  ఒక పార్టీ నాయకుడి  నాయకుడి అనుచరులు జనాన్ని కొట్టడం చంపడం తో తామంతా భయాందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు. ఇల్లంతకుంట మండలంలోని ఓ పార్టీ నాయకుడి అక్రమ దందా పోలీసులకు ఫొటోస్ తీసి  తెలిపినందుకు ఒక వ్యక్తిని ఇటీవలే   ఆ  నాయకుడి 10 మంది అనుచరులు, దుండగులు  ఆయుధాలతో వచ్చి ఇష్టమొచ్చినట్టు కొట్టి చంపే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని మండల ప్రజలు మర్చిపోకముందే 

శనివారం  రోజున  ఇదే  నాయకుడి అనుచరుడు ఇల్లంతకుంట కూన బోయిన సుధాకర్ అనే  అతను   ఒక సామాన్య కార్యకర్త  అనిల్ ను వెంటాడి ఇష్టమొచ్చినట్లు  కొడుతూ చంపే ప్రయత్నం చేయడంతో ముక్కు బొక్క విరగడంతో రక్తం ధారలుగా కారడం తో అటుగా వెళ్తున్న జనం ఆ దుండగుడి ని ఆపడంతో రక్తం దారాలతో బాధితుడు పరుగెత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఫిర్యాదు చేసిన   రిమాండ్ చేయకపోవడంతో ఈ దుండగులకు భయం లేకుండా పోయింది.మళ్లీ  ఇదే  ఓ పార్టీ   మండల  నాయకుడి  అనుచరుడు దోమ్మటి వెంకటేశం  అక్రమ ఇసుక దందా గురించి జిల్లా పోలీసులకు చెప్పాడని ఒక యువకుడిని ఇష్టమొచ్చినట్లు కొట్టి ఎవరికైనా చెబితే  చంపుతానని బెదిరించాడు.

అలాగే కంది కట్కూర్ గ్రామంలోని మానేరు వాగు లో తన అక్రమ ఇసుక దందాను మైనింగ్ అధికారులకు చెబుతున్నాడని  ఒక దళిత నిరుపేద బిడ్డ న్యాత అశోక్ ను దొమ్మాటి వెంకటేశం, కొమిరె కనకయ్య  ఇద్దరు కలిసి  ఇనుప రాడ్తో తమ ఇష్టం వచ్చినట్లు  కొట్టడంతో చేయి విరిగి సొమ్మసిల్లి పోవడంతో చచ్చిపోయాడని విడిచిపెట్టి వెళ్లడంతో గంట తర్వాత స్పృహలోకి వచ్చిన న్యాత అశోక్  ఏడుచుకుంటూ   అరవడంతో అటుగా వెళ్తున్న రైతులు తనని ఇంటికి తీసుకొచ్చి డాక్టర్ ను పిలిపించి చూపించి ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినాడు, ఈ ఒక దళిత కుటుంబానికి చెందిన న్యాత అశోకుని వాగులో కొట్టడమే  కాకుండా...

కంది కట్కూర్ గ్రామంలోకి వచ్చి ఎంపీటీసీ తండ్రి అయిన కారోబార్ రాజేశం ను కూడా దొమ్మాటి వెంకటేశం, తన కుమారులు,ఋషి, అజయ్, కొమిరె కనకయ్య లను  వెంట వేసుకుకొనివచ్చి ఇనుప రాడ్తో  కర్రలతో మెడ నరాల పై కొట్టడంతో రాజేశంను చనిపోయే వరకు వదలకుండా అక్కడే చుట్టుముట్టి కొట్టడంతో  అక్కడికి అక్కడనే అయన చనిపోవడం మీకు తెలిసిందే.కందీకట్కూర్ గ్రామంతో  పాటు ఇల్లంతకుంట మండలం ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.

ఇల్లంతకుంట మండల ఓ పార్టీ నాయకుడి  నాయకుడి వల్ల,  అనుచర రౌడీలా  వలన మండల ప్రజలు అందరూ ప్రాణాలని  గుప్పెట్లో పెట్టుకొని బతుకతుకుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి  కేటీఆర్  స్పందించి ఈ  అక్రమ ఇసుక దందా నాయకుడిని నివారించి    పార్టీ పరువు కాపాడుకోవలసిందిగా  ప్రజలు కోరుచున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ దుండగుల అక్రమ ఇసుక దందాలను అరికట్టి,  వీరి ఆగడాలను హ త్యాలను హత్యా యత్నాలను దాడులను ఆపి వీరిని కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు జిల్లామంత్రిని వేడుకుంటున్నారు.జిల్లా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే రామ రాజ్యం  లాంటి జిల్లాలో రాక్ష దాడులను ఆపాలని వారు కోరుతున్నారు.

You Might Also Like