సోషల్ మీడియా తో చెడు జరుగుతుందంటున్న ఈ రోజుల్లో అదే సోషల్ మీడియా తో లాభం జరిగిన వైనమిది.పదేళ్ల క్రితం తండ్రిని, కొన్ని రోజుల క్రితం తల్లిని కోల్పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న ఇద్దరు చిన్నారుల పై సోషల్ మీడియా లో వచ్చిన  కథనానికి బోలెడు మంది దాతలు స్పందించారు .ముఖ్యం గా ఈరోజున్యూస్.ఇన్ వచ్చిన కథనానికి తెలంగాణమంత్రికేటీఆర్ స్పందించి వారికి అండగా ఉండేందుకు ముందుకువచ్చారు.ఈ మేరకు కేటీఆర్ సూచనలతో అధికారులు బ్యాంక్ అకౌంట్ తీసారు.


సోషల్ మీడియా లో వచ్చిన  కథనానికి స్పందించిన దాతలు ఇప్పటివరకు ఆరు లక్షలు అందించారు. మరో వైపు జాగృతి అధ్యక్షురాలు కవిత  ట్వీట్ తో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిన్నారులను కలిసి, కుటుంబసభ్యులు ఎవరైన ఉన్నారా అని సంబంధిత గ్రామస్దులతో ఆరా తీశారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి, కరీంనగర్ లోని వెంకట్ ఫౌండేషన్ కు అబ్బాయిని అమ్మాయిని స్వదార్ ఆశ్రమంలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు.వీరిపై వ్రాసిన కథనాలకు సోషల్తో మీడియాలో మానవటం ఉన్నవారు వెంటనే స్పందించి వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ముఖ్యం గా వీరిపై వార్తను ప్రచురించిన v6  తో పాటు సోషల్ మీడియాలో  ముచ్చట ,ఏపీహెరాల్డ్  ఈరోజు లో వచ్చిన వార్తలకు విపరీతమైన స్పందన వచ్చింది.ఆ కుటుంబానికి  అండగా నిలుస్తామని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. తల్లి మరణించిన రోజే అంతక్రియలకోసం జిల్లా సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడి సాయాన్ని అందజేసిన  అయన  జాగృతి అధ్యక్షురాలు కవిత కవిత ట్వీట్ తో  జాగృతి అధ్యక్షురాలు కవిత ట్విట్టర్ ద్వారా చిన్నారుల భాద్యత చూసుకోవాలని కోరగా, ఎమ్మెల్యే ఆశ్రమంలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. లక్ష రూపాయల సహాయం అందించిన జగిత్యాల మున్నూరు కాపు సంఘం, ఇతర దాతలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు గుగ్గిళ్ల హరీష్, మల్లికార్జున్, దావ సురేష్, భోగ ప్రవీణ్, రంగు గోపాల్, నాగయ్య, డిడబ్లుఓ డా.నరేష్, పిల్లల హక్కుల అధికారి హరీష్ తదితరులు పాల్గొన్నారు.ఇంకా ఎవరైనా దాతలు వారికి సాయం చేయాలనుకుంటే ముందుకు రావాలని ఈరోజున్యూస్.ఇన్ కోరుతూ ఇప్పటి వరకు సాయం చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియ జేసింది.

You Might Also Like