రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందనే ఆరోపణలు గతం నుండే ఉన్నప్పటికీ ఇందులో అధికారుల అవినీతిని వాట్స్ అప్ లో వైరల్ అవుతున్న ఆడియో లు తేటతెల్లం చేస్తున్నాయి.ఇసుక రవాణాకు రెవిన్యూ అధికారుల చేతివాటంకు తోడు పట్టుకున్న ట్రాక్టర్లకు పోలీస్ ల అమ్యామ్యాలు బారి మొత్తం లోనే ఉంటాయనే విషయాన్నీ ఈ ఆడియోలు బహిర్గతం చేస్తున్నాయి.ఆడియో ల్లో ఉన్న సంభాషణ వివరాల్లోకి వెళితే జిల్లాలోని చివరగా ఉండే ఒక మండలంలో ఇసుక పుష్కలంగా దొరకడం  తో పాటు పది కిలోమీటర్ల లోపే హైవే ఉండగా హైదరాబాద్ కు ఇసుకను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక్కడి నుండి ఇసుకను రవాణా చేసే వేములవాడ మండలం లోని నూకలమర్రి గ్రామానికి చెందిన ఒక అక్రమ రవాణా దారు ట్రాక్టర్ను పోలీసులు అక్కడ పట్టుకున్నారు.సదరు ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్ ను బయటకు తెచ్చుకోవాలని ఇదే సర్కిల్ లో ఉన్న తానా లో ఒక పోలీస్   తో కలిసి ,పట్టుకున్న పోలీస్ స్టేషన్ కు సంబందించిన ఇంకో పోలీస్ను కలిసి, అక్కడి అధికారిని అప్రోచ్ అయ్యారట.మొదట ఆ పోలీస్ తన అధికారి తో తన ఫోన్లో మాట్లాడించగా ఆ అధికారి వాట్స్ అప్ లో మాట్లాడమని కోరుతూ తాను సాయం చేస్తానని  చెబుతూ చేసిన సాయానికి నజరానా గా మొదట  రెండు  లక్షల రూపాయలు డిమాండ్ చేయగా 80  వేలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి ఇందులో 50  వేళ రూపాయలు చేల్లించారట.

అయితే ఇక్కడే ఆ అధికారికి బాధితుడికి మధ్య జరిగిన ఒప్పందం చెడిందని తన ట్రాక్టర్ ను ఎమ్మార్వోకు బైండోవర్ చేయాలనీ చెప్పినప్పటికీ మైనింగ్ వాళ్లకు ఆ అధికారి సరెండర్ చేసాడని బాధితుడు బాహాటం గానే అసంతృప్తి వ్యక్తం చెయ్యగా మధ్యవర్తిత్వం వహించిన రెండు ఠాణాల పోలీసులు మిగతా  30  వేళ రూపాయల చెల్ల్లిన్ చాలని ఆ  అధికారి తమను అడుగుతున్నాదాని  దాని కోసం తమ మాట పోతదని వాళ్ళు బాధితున్ని కోరిన సంభాషణలను రికార్డు చేసి ఆడియోల రూపం లో బయట పెట్టారు.ఇందులో ఒక అధికారి వాట్స్ అప్ లో రికార్డు చేయరనుకుని వాట్స్ అప్ కాల్ కు రావాలని కోరగా ఆ కాల్ ను కూడా రికార్డు చేసి వైరల్ చేశారు ఆ ప్రబుద్దుడు.ఆ  ఆడియో లు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మొత్తనికి వైరల్ అవుతున్న ఆడియోల తో అధికారుల అవినీతి బయట పడుతుండగా ఈ  ఆడియోలను వైరల్ చేసిన నూకాలమర్రికి చెందిన బాధితుడు పర్శ రాములు జిల్లా ఎస్పీని కలిసి పరిస్థితులు వివరిస్తారని తెలుస్తుంది.మొత్తానికి ఈ ఆడియో టేపుల వ్యవహారం పై జిల్లా ఎస్పీ విచారణ జరపాలని బాద్యులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆడియో టేపులు  నిజంగా జరిగిన సంభాషణ లేకా అబద్దపు ప్రచారమా ఆ గొంతులు నిజంగా అధికారులవేనా తేల్చి అబద్దమైతే బాద్యులపై,కాకుంటే అందులో అవినీతి చేసిన అధికారులపై,మొత్తానికి ఈ ఆడియో టేపుల వ్యవహారం పై జిల్లా ఎస్పీ విచారణ జరపాలని బాద్యులపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

You Might Also Like