రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజు కు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వేములవాడ పట్టణం లో నూకలమర్రి రోడ్ లో హెరిటేజ్ వద్ద నివాససముంటున్న మరో ఇద్దరికీ శనివారం కరోనా ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలింది.వీరిద్దరూ భార్య భర్తలు కాగా వీరు ఇటీవలే ముంబై నుండి ఇక్కడికి వచ్చిన వలస కార్మికులుగా అధికారులు పేర్కొన్నారు.అయిదు రోజుల క్రితమే వేములవాడకు చేరుకున్న వీరిద్దరి తో పాటు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వీరి పిల్లల టెస్టింగ్ రిపోర్టులు ఇంకా అందలేదని తెలుస్తుంది. వీరంతా వేములవాడలో అన్ని చోట్ల తిరిగారని షాపింగ్ కు,పాల ప్యాకెట్లకు ప్రజల్లో తిరిగారని వీరి ద్వారా బారి ఎత్తున పట్టణము లో కరోనా వ్యాపించే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

శనివారం సాయంత్రం వీరికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణగా కావడం తో చికిత్స నిమిత్తం వీరిని ఈ రోజు రాత్రికి గాని రేపు ఉదయం గాని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపే అవాకాశాలున్నాయి.అయితే అధికారులు మాత్రం వీరికి ఇక్కడే ఉంచి చికిత్స చేయించాలనే ఆలోచనా తో ఉన్నట్టు సమాచారం.ఇప్పటి వరకు వేములవాడ లో మండలం లో పదకొండు  కేసులు నమోదు కాగా మండలం లో ని నాగయ్య పల్లి లో రెండు ,షాత్రజుపల్లి లో రెండు,నూకలమర్రిలో ఒకటి,రుద్రవరంలో ఒక కేసునమోదయ్యింది.ఇందులో నూకలమర్రి కేసును మినహా మిగతా పది కేసులు అధికారకంగా ప్రకటించారు.పట్టణం లో ఆరు కేసులు నమోడు కాగా కరెక్ట్ గా పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని కేసులు మరిన్ని పాజిటివ్ గా బయట పడే అవాకాశంఉంది.  దీనితో రోజు రోజుకు వేములవాడ పట్టణం లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుండటం తో   పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.

మొదట పట్టణం లోని శుభాష్ నగర్ లో మర్కజ్ యాత్రికులకు ముగ్గురికి  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి.ఆ తరువాత గాంధీనగర్ లో ఒకరికి ఇప్పుడు నూకలమర్రి  రోడ్ లో రెండు కేసులు నమోదు కాగా  కేసులన్నీ ముంబై వలస కార్మికులవే కావడం గమనార్హం.ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం సాయంత్రం ధ్రువీకరించారు. అయితే మూడు కేసులున్నపుడు కంటైన్మెంట్ పేరుతో మూసినా అధికారులు ఇప్పుడు కేసులు పెరుగుతున్న అన్ని తెరిచి పెట్టడం పై పలు విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి.

అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై ఆయా ఏరియా లలో కంటైన్మెంట్ కాకున్నా నిర్బంధం విధించి వారు ఎవరితో కాంటాక్ట్ అయ్యారో గుర్థించి వారికి పరీక్షలు నిర్వ హించ కుంటే బారి ఎత్తున వ్యాధి ప్రబలే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వం కరోనా తో సహజీవనం చేయమని చెప్పిందని ప్రజారోగ్యాన్ని  గాలికి వదిలి వేయవద్దని అధికారులను వారు కోరుతున్నారు.

You Might Also Like