1.                                                                    

                                                                                      ( బుదారం శ్రీనివాస్ , వరంగల్ )

అందరు అను కున్నట్లే జరిగింది.మృతులందరికి నిద్ర మాత్రల తో కూడిన కూల్ డ్రింక్స్ ఇచ్చి వారు   మైకం లో ఉండగానే పథకం ప్రకారం వారిని బావిలో వేసిచంపినట్లు ,తన  ఒక్కడితోనే కాకుండా ప్రియురాలు బస్రా పలువురితో అక్రమ సంబంధాలు  పెట్టుకుందని కసితో తాను ఈ నేరాలకు పాల్పడ్డట్లు  నిందితుడు అంగీకరించడం తో వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో ఉన్న ఒక గోనె సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో లభించిన 9 మంది మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. అనుమానాస్పద స్థితిలో తొమ్మిది మంది వలసకూలీల మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లాలో, తెలంగాణలో నే కాకుండా   దేశ వ్యాప్తంగాసంచలనం సృష్టించింది.ఒక దశలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ కేసు పై విచారణ జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో తెలంగాణ పోలీస్ లు ఖంగు తిన్నారు.

కేసు ను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీస్  కమిషనర్ డాక్టర్ రవీందర్ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తమడైన  శైలిలో విచారణ జరుపడం తో  తోమ్మిది మందిని తానే హత్య చేసినట్టు నిందితుడు సంజయ్ యాదవ్  పోలీసుల ఎదుట  అంగీకరించినట్టు సమాచారం. మక్సూద్ అతడి కుటుంబసభ్యులకు కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు ఇచ్చి, వారు స్పృహకోల్పోయిన తర్వాత వారిని తీసుకుని వెళ్లి బావిలో పడేసినట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన తన స్నేహితుల సాయంతో ఈ పని చేసినట్టు పోలీసుల ఎదుట సదరు నిందితుడు అంగీకరించినట్టు సమాచారం .సమగ్రమైన విచారణ తర్వాత వరంగల్ పోలీసులు నిందితుడిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

మొదట ఆత్మహత్యలే అనుకున్నా 

వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి.గురువారం  నాలుగు మృతదేహాలు, శుక్రవారం మరో 5 మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందినఆరుగురి మృతదేహాలు, వారితో పాటు మరో ముగ్గురు శవాలు బావిలో ఉండటంతో వారివి హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనేఅనుమానాలు వ్యక్తమయ్యాయి.అయితే అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ మరణాలన్నీ బతికుండగానే జరిగినట్లు ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ తెలిపారు. ఆ 9 మందిని బతికుండగానే బావిలో పడేసినట్లు ,మూడెేళ్ల బాలుడు మినహా మిగతా మృతుల శరీరాలపై వాళ్ళను ఈడ్చుకు వెళ్లినట్లు  కొన్ని గీతలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. వారందరినీ బావి దగ్గరకు ఈడ్చుకువచ్చి బావిలో పడేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా వారు తిన్న ఆహారంలోనైనా లేక పానీయం లోనైనా మత్తు పదార్ధాలు కూడా కలిసినట్లు డాక్టర్ రజా మాలిక్ తెలిపారు. మత్తులో ఉండగా బావిలో పడేయడంతో అందరి ఊపిరితిత్తులలోకి నీరు చేరి వారంతా మరణించారని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.ఈ నేపత్యంలో ఆ కోణం లో విచారణ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపగా కేసు కొలిక్కి వచ్చిందని తెలుస్తుంది.


ఎం జరిగింది...
ఎండీ మక్సూద్ నేవ్యక్తి ‌  20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గత డిసెంబరు నుంచి గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గత నెలన్నర నుంచి గోడౌన్‌లో ఉంటున్నాడు. మక్సూద్‌తోపాటు, ఆయన భార్య నిషా,  మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం, సోహెల్ ఆలం , ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. దీనితో పలువురు వయసులో ఉన్న బుస్రా పై కన్నేసి ఆమెను శారీరక ఆవసారలకు వాడుకుంటుండటం తో ఒకరి తరువాత ఒకరు వారింటికి వెళ్లి నయాన్నో భయానో ఆమెను లొంగదీసుకుంటున్నారు.నగరంలోని జావెద్, సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తులతో అమేకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

మరోవైపు, బుస్రాకు తన తల్లితోనూ గొడవలు ఉన్నట్లు సమాచారం. ఆమె కూడా షకీల్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు తెలుస్తుంది.ఇంటిపై ఉంటున్న బిహార్‌కు చెందిన కార్మికులు శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసి బస్రాను శారీరకం గా లోగదీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ తన  ఓక్కడితోనే కాకుండా బుస్రా పలువురితో అక్రమ సంబంధాలు  పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను ఆమె కుటుంబాన్ని హతమార్చడానికి పథకం రూపొందించాడు. ఈ నేపత్యంలో  ఢిల్లీలో ఉన్న బుస్రా మాజీ భర్త ఖతూర్ కు ఈ విషం చెప్పి అయనను సహక రించాలని కోరాడు.

పథకం ప్రకారమే ఆ వారింటికి కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు కలుపుకుని వెళ్లి వారికి మద్యం కూల్డ్రిం క్స్ ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకా మొదట మక్సూద్ , అతని భార్య నిషా, కుమార్తె బూస్రా, మూడు సంవత్సరాల వయసున్న బూస్రా కొడుకు , మక్సూద్ ఇద్దరు కొడుకులు షాబాద్ ఆలం, సోహెల్ ఆలం ,లను గొనె సంచుల్లో పైన ఉంచి లాక్కెళ్లి బంగ్లా పై నుండి బావిలోకి విసిరి వేశామని ,ఇద్దరు బిహారీలను బావిలో విసరవద్దని ,వదిలేద్దామని సంజయ్‌ భావించి నప్పటికీ   కేసు బయటకు వస్తే తనను వారు గుర్తిస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు ఆ తరువాత షకీల్ ను కూడా బావిలోకి వేసినట్లు విచారణలో బయటపడింది.

ప్రస్తుతం సంజయ్‌ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఖతూర్‌ డైరెక్షన్‌లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్‌ చెబుతుండగా ,ఇక మక్సూద్‌ భార్య, కూతురితో సంజయ్‌ వాట్సప్‌ చాటంగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్‌ పోలీసులు కేసును చేధించడం తో వరంగల్ పోలీసులను ప్రజలు ప్రశంసిస్తున్నారు.


You Might Also Like